![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -916 లో... రాహుల్ చెప్పినట్లు సాండీ, రాజ్ దగ్గరికి వెళ్లి దొంగ బంగారం సప్లై చేస్తాను అంటే రాజ్ తనని తిట్టి పంపిస్తాడు. ఆ విషయం సాండి, రాహుల్ కి ఫోన్ చేసి చెప్తాడు. నువ్వు రాజ్ దగ్గరికి వెళ్ళావ్ బయటకు వచ్చావ్.. ఆ ప్రూవ్స్ ఉంటే చాలని రాహుల్ అంటాడు.
మరొకవైపు కావ్యకి వచ్చిన కలకి ఇంట్లో జరిగిన సంఘటనకి అపర్ణ, ఇందిరాదేవి కంగారుపడుతారు. దాంతో ఇద్దరు కావ్యని తీసుకొని గుడికి వెళ్తారు. అక్కడ పంతులు ఏమైందని అడుగుతాడు. ఇల్లు తగలబడిపోయినట్లు కల వచ్చింది.. అంతే కాకుండా ఇంట్లో హారతి ఇస్తుంటే దీపం ఆరిపోయిందని అపర్ణ, కావ్య చెప్తారు. దాంతో పంతులు కొద్దీసేపు అలోచించి ప్రమాదం బయట నుండే వస్తుంది.. జాగ్రత్తగా ఉండండి అని పంతులు అనగానే ముగ్గురు భయపడుతారు. దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని ఇందిరాదేవి అడుగుతుంది. మీరు ఎప్పుడు దేవతారాధన చెయ్యాలని పంతులు చెప్తాడు.
మరొకవైపు దుగ్గిరాల ఇంటికి అనుకోకుండా ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. తనకి ఎదురుగా రుద్రాణి వచ్చి.. ఏంటి రేఖ ఇంత సడన్ గా ఇంటికి వచ్చావని తనని అడుగుతుంది. మమ్మీ వచ్చి రాగానే ఏంటి ఈ ప్రశ్నలు అని చిరాకుగా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి స్వప్న వెళ్లి మీ చెల్లి అమెరికా నుండి వచ్చింది అనగానే ఇప్పుడు ఎందుకు వచ్చిందని తన దగ్గరికి వెళ్తాడు. రేఖ హాల్లో ఉండగా అందరు తనని ఎప్పుడు వచ్చావని పలకరిస్తారు. రాహుల్ మాత్రం మా మాట వినకుండా వెళ్లిపోయావ్ ఎందుకు వచ్చావని తనపై కోప్పడతాడు. ఇప్పుడు వచ్చింది కదా ఎందుకు గొడవ అని ఇందిరాదేవి అంటుంది.
ఆ తర్వాత ఇకనుండి రాజ్ ఆఫీస్ కి వెళ్లడానికి వీలు లేదు.. కావ్య కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని ఇందిరాదేవి అనగానే అయితే ఆఫీస్ ఎవరు చూసుకుంటారని రాజ్ అంటాడు. ఇంకెవరు మీ డాడీ, బాబాయ్ చూసుకుంటారని అపర్ణ అంటుంది. అయితే సరే ఇప్పటినుండే కావ్యని కాలు కిందపెట్టకుండా చూసుకుంటానని కావ్య ని రాజ్ ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటే.. రేఖ అలాగే చూస్తూ ఉంటుంది.
ఆ తర్వాత రేఖ, రుద్రాణి బయట మాట్లాడుకుంటారు. ఇంత సడన్ గా ఏంటి .. అక్కడ మార్క్ ని ప్రేమించాను.. అక్కడే సెటిల్ అవుతానన్నావని రుద్రాణి అడుగుతుంది. అనుకున్నాను కానీ బ్రేకప్ అయింది.. వాడికి డబ్బు లేదు.. నా మీద లవ్ లేదని తెలిసింది. ఇదంతా నీ వల్లే.. అప్పుడే బావని నాకు ఇచ్చి చేస్తే నేను అలా దేశాలు పట్టుకొని వెళ్లేదాన్ని కాదు కదా అని రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |